న్యూఢిల్లీ: న్యాయపరమైన ఆటంకాలు ఎదురు కాకపోతే ముంబై దాడుల కేసు దోషి అజ్మల్ కసబ్ కు ఈ ఏడాది లోగా ఉరిశిక్ష అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముంబై దాడుల కేసులో కసబ్ కు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. కింది కోర్టు తీర్పును కసబ్ పైకోర్టులో సవాల్ చేయకపోతే ఈ ఏడాది చివరిలోగా ఉరిశిక్ష అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ కార్యదర్శి కెజి పిళ్లై మంగళవారం ఓ టీవీ చానెల్ తో చెప్పారు.
పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురు పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ పై ప్రశ్నించగా అది ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్లే హక్కు కసబ్ కు ఉంటుంది.