ఈ వారంలో అంతరిక్షంలో మరో అద్భుతం

ఈ మూడు రోజుల్లో రాత్రి అయ్యేకొద్దీ చంద్రుడికి కొద్దిగా పైన కుజ గ్రహాన్ని సుస్పష్టంగా చూడవచ్చని స్టార్ డేట్ మేగజైన్ ఎడిటర్లు తెలిపారు. కుజుడికి ఎడమవైపు మఖ మెరుస్తూ ఉంటుందని వివరించారు. ఇక, మే 20వ తేదీన చంద్రుడికి కుడి వైపున మఖ మెరుస్తూ ఉంటుందని, చంద్రుడికి కుడి వైపునే దూరంగా కుజుడు ప్రకాశిస్తాడని, ఈ మూడూ కలిసి పెద్ద త్రిభుజంగా ఏర్పడతాయన్నారు.
మే 21వ తేదీన రాత్రి అయ్యేకొద్దీ శనికి, కుజ గ్రహానికి మధ్యలోకి చంద్రుడు వస్తాడని, శని గ్రహం బంగారు వర్ణంలో కనిపిస్తుందని వివరించారు. ఇక, మే 22వ తేదీన చంద్రుడు శని గ్రహానికి దిగువన, సూర్యాస్తమయ సమయంలో దక్షిణ దిశగా ఆకాశంలో పైన కనిపిస్తాడని తెలిపారు.












Click it and Unblock the Notifications