ఆగిరిపల్లి: కృష్ణాజిల్లా ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి గతరాత్రి దారుణ హత్యకు గురి అయ్యాడు. మృతుడు శ్రీకాకుళం జైలు నుంచి పరారైన రుద్రాక్షపల్లి నర హంతకుడు తాటిపర్తి రామారావుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుని వేలిముద్రలు, ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
తాటిపర్తి రామారావు ఏడు హత్య కేసుల్లో నిందితుడు. ఇతడిని గత ఏడాది అక్టోబర్ 4న శ్రీకాకుళం పోలీసులు అరెస్టు చేశారు. ఐదు నెలలు కూడా తిరగకముందే ఇతను జైలు నుంచి పారిపోయాడు.