నన్ను తెలంగాణలో అడ్డుకోరు: చిరంజీవి

ఏ ఉద్యమమైనా గల్లి నుంచే ప్రారంభమవుతుందన్న విషయం గుర్తించుకుని అధికార పార్టీ నాయకులు మాట్లాడాలని సూచించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు హామీలు గుప్పించిన వారికి కనువిప్పు కలిగించేందుకే ఈ ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. పిట్టకథల మాదిరిగా చెబుతున్న వట్టిమాటలను కట్టిపెట్టి కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతూ కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నాలు చేశారని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు సంతృప్తికర ప్యాకేజి ప్రకటించటంతోపాటు ముంపువల్ల ఎక్కడైతే ఎక్కువగా నష్టపోతారనుకున్నారో వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టు సాధన యాత్ర పేరిట విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో నిరంతరాయంగా పర్యటిస్తున్న ప్రరాపా అధినేత చిరంజీవి ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. మండుటెండల్లో అవిశ్రాంతంగా ఆయన పర్యటించటం వల్ల జలుబు, దగ్గుతోపాటు జ్వరంతో బాధపడుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.












Click it and Unblock the Notifications