విమానం ప్రమాదం: 160 మంది మృతి

Air India Express Aircraft
బెంగుళూర్: కర్నాటకలోని మంగళూర్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో రన్ వేను దాటి వెళ్లి కొండను ఢీకొట్టింది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో మంటలు లేచి ఆగ్నికి ఆహుతి ఆయింది. ఈ సమయంలో విమానంలో 173 మంది ఉన్నారు. వారిలో 167 మంది ప్రయాణికులున్నారు. మిగతా ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారు. వారిలో 160 మంది మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఏడుగురిని ప్రమాదం నుంచి రక్షించారు. ఈ ప్రమాదం శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో జరిగింది. ఈ విమానం దుబాయ్ నుంచి మంగళూర్ వచ్చింది.

ప్రమాదానికి సంబంధించి తమకు ప్రాథమిక సమాచారం మాత్రమే ఉందని, తాము వివరాల కోసం ఎదురు చూస్తున్నామని డిజిసిఎ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ఎ జైదీ చెప్పారు. విమానాశ్రయానికి పది కిలోమీటర్ల దూరంలో కొండను ఢీకొట్టి విమానం కూలిందని కర్నాటక హోం మంత్రి చెప్పారు. ప్రమాదంలో 160 మంది దాకా మరణించి ఉంటారని ఆయన చెప్పారు. సంఘటనా స్థలానికి 25 అంబులెన్స్ లు చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పౌర విమాన యానాల మంత్రి ప్రఫుల్ పటేల్ ప్రమాద స్థలానికి బయలుదేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+