పసిడి కంటే ప్రియంగా పెసరపప్పు

Green Gram
వేసవిలో చలువ చేస్తుందని పెసరపప్పు ఎక్కువగా వాడుతుంటారు. ఈ వేసవిలో పెసరపప్పు కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో పెసర పప్పు ధరలు ఎండలతో సమానంగా మండిపోతున్నాయి. కాస్త ఎక్కువ సొమ్ము పెట్టుకుంటే బంగారమైనా ఎక్కడబడీతే అక్కడ దొరుకుతుంది. కానీ చాలా ప్రదేశాల్లో పెసరపప్పు కంటికి కన్పించడం లేదు. రాష్ట్రంలో పెసర పంట సాగు తగ్గిపోవడం, వేసవిలో దీని వినియోగం పెరగడంతో పెసర పప్పు ధరలు ఏకంగా కిలో 96 రూపాయల వరకు చేరుకున్నాయి. సాధారణ ప్రజలు పెసర పప్పు కొనుగోలు చేసేందుకు సైతం భయపడే పరిస్థితి నెలకొంది. హోటళ్ళలో పెసరట్టు ప్రియులకు నిరాశ కలుగుతోంది.

గత ఏడాది పెసర సాగు గణనీయంగా తరిగి పోవడం, అక్కడక్కడా వేసిన పంట కూడా ఆశించిన రీతిలో దిగు బడి ఇవ్వకపోవడం తదితర కారణాలతో పెసరపప్పు మార్కెట్లోకి రావడం అరుదై పోయింది. పొరుగు రాష్ట్రాలలో సైతం పెసర దిగుబడి సాధారణ స్థాయికంటే 50 శాతానికి పడిపోయింది.

ఇక మిగిలిన పప్పు ధాన్యాల పరిస్థితి దాదాపు అదే విధంగా ఉంది. మినప్పప్పు ధరలు గత జనవరిలో బాగా తగ్గినట్లనిపించి నప్పటికీ రెండు నెలలుగా వీటి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. కిలో మినప్పప్పు ధర నేడు మార్కెట్లో 76 రూపాయలకు చేరుకుంది. గత ఏడాది ఎన్నికల సీజన్‌లో దడ దడలాడించిన కంది పప్పు ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు. ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీలు కల్పించి కంది పంట సాగును ప్రోత్సహించింది.పప్పు ధరలు మండిపోతున్నాయి. అంతే కాదు చాలా ప్రదేశాల్లో పెసరపప్పు కంటికి కన్పించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+