శ్రీకాళహస్తి రాజగోపురం కింద 3 మృతదేహాలు

రాజగోపురం శిథిలాలను గత మూడు రోజులుగా నాలుగు ప్రొక్లెయిన్లతో తొలగిస్తున్నారు. శిథిలాలను పూర్తిగా తొలగించడానికి మరో మూడు నాలుగు రోజులు పట్టవచ్చునని భావిస్తున్నారు. రాజాతో పాటు మరో ఇద్దరు మహిళలు శిథిలాల కింద మరణించి ఉంటారని భావిస్తున్నారు. రాజా కుటుంబ సభ్యులు గత రెండు రోజులుగా ప్రమాదం జరిగిన చోట కాచుకుని ఉన్నారు. ఒక మృతదేహం బయటపడడంతో శిథిలాల తొలగింపు పనులు ఆపేశారు. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications