వైయస్ జగన్ మా రక్తంపై నడిచి వస్తాడా: కె. చంద్రశేఖర రావు

వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలపై మేం ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించామని, ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరి కారణంగా శుక్రవారం తొమ్మిది మంది తెలంగాణవాదులకు బుల్లెట్‌గాయాలయ్యాయని ఆయన అన్నారు. కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కొండా మురళీనే కాల్పులు జరిపారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారని, ఎవరు కాల్పులు జరిపారన్నది ప్రభుత్వం తేల్చిచెప్పాలని, జరిగిన ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన అన్నారు. మహబూబాబాద్‌లో కొండ వర్గీయులే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తెలంగాణవాదులపై దాడిచేశారని, దీన్ని అడ్డుకునే క్రమంలో తెలంగాణవాదులు ప్రతిదాడికి దిగారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications