చిత్తూరు: తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తిరుగుపయనమైన ఓకుటుంబం తిరిగిరాని లోకాలకు వెళ్లింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మామడుగు వద్ద ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. తిరుమల నుంచి బెంగుళూరు వెళుతున్న మారుతీ కారు ఎదురుగా వస్తున్న క్వాలీస్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతులంతా తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందినవారుగా భావిస్తున్నారు.