తిరుపతి: సిపీఐ నాయకుడు నారాయణ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మళ్ళీ విరుచుకుపడ్డారు. హోం మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి తగిన వారు కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. ఆమెను మార్చడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. కడప ఎంపి వైయస్ జగన్మోహన రెడ్డి గవర్నర్‌ని కలవడం కొత్త సంప్రదాయానికి తెరలేపినట్లైందన్నారు.
మహబూబాబాద్‌లో జరిగిన సంఘటన వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నారాయణ చిరంజీవిని కూడా విడిచిపెట్టలేదు. చిరంజీవిని నమ్మి ప్రజారాజ్యం పార్టీలో చేరిన మేధావి వర్గాన్ని ఆయన నట్టేట ముంచారన్నారు.