హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్రిక్తత ఉన్నా జూన్ 1 నుంచి శ్రీకృష్ణ కమిటీ పర్యటన

By Santaram
|
Google Oneindia TeluguNews

BN Srikrishna
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాంతీయ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ పనులు చకచకా సాగుతున్నాయి. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినా శ్రీకృష్ణ కమిటీ ఏడో విడత పర్యటన యథాతథంగా సాగనుంది. జూన్‌ ఒకటో తేదీన కమిటీ సభ్యులు రాష్ట్రానికి వస్తారు. మంగళవారం ఆలిండియా బంజారా సేవాసంఘం, తెలంగాణ రచయితల వేదిక, ప్రజాస్వామ్య తెలంగాణ సమితి, ఉత్తరాంధ్ర రక్షణ సమితి వేదిక, మన్యసీమ సాధన సమితి, రాయలసీమ మేధావుల ఫోరం, రాష్ట్ర స్వాతంత్య్ర సమర యోధుల వేదికతో భేటీ అవుతుంది.

బుధవారం తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తల ఫోరం, రాయలసీమ రాష్ట్ర సాధన సమితి, తెలంగాణ విమోచన సమితి, ఉద్యమ జేఏసీతో పాటు విశ్రాంత సైనికాధికారి జి.బి.రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో సమావేశం నిర్వహిస్తుంది. రెండో తేదీ రాత్రి కమిటీ సభ్యులు ఢిల్లీకి వెళ్లిపోతారు. ఛైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ రావడం లేదు.

సత్వరమే సమాచారం: శ్రీకృష్ణ కమిటీకి ప్రభుత్వపరంగా అందించాల్సిన సమాచారాన్ని అన్ని శాఖలు సత్వరమే సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌ ఆదేశించారు. ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. శ్రీకృష్ణ కమిటీ సంప్రదింపులు వచ్చే నెల 18తో ముగుస్తున్నందున ఆలోపే అన్ని శాఖలు సమాచారాన్ని సిద్ధం చేయాలని సూచించారు. 1956 నుంచి శాఖల వారీగా కేటాయింపులు, వినియోగం, ప్రగతి, మంత్రులు, ఇతర రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో నియమితులైన వారి వివరాలు, ఉద్యోగ నియామకాల తదితర వివరాలను సమగ్రంగా రూపొందించాలని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X