వైయస్ జగన్ ఒంటరి: దూరమవుతున్న కాంగ్రెసు నేతలు

YS Jagan
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెసు రాజకీయాల్లో వైయస్ జగన్ ఏకాకి అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తనకు అత్యంత సన్నిహితులు అనుకున్నవారు ఆయనకు దూరమవుతున్నారు. నిజానికి, వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనూ ఆ తర్వాత కూడా జగన్ ను అభిమానించిన మంత్రులు, శాసనసభ్యులు కూడా ఆయనకు దూరం జరుగుతున్నారు. జగన్ తొందరపాటు, మొండిపట్టు అందుకు కారణమని భావిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు మంగళవారం దాదాపుగా ముక్తకంఠంతో ముఖ్యమంత్రి కె. రోశయ్యకు మద్దతు ప్రకటించారు. రోశయ్య ప్రభుత్వాన్ని జగన్ విమర్శించడాన్ని తప్పు పట్టారు.

సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్ వంటి మంత్రులు, చాలా మంది శాసనసభ్యులు జగన్ కోసం కాంగ్రెసు పార్టీకి దూరమయ్యే స్థితిలో లేరు. జగన్ వ్యవహార శైలే అందుకు కారణమని రాజకీయ వర్గాల విశ్లేషణ. ప్రజాదరణ గల తనను కాంగ్రెసు అధిష్టానం వదులుకోదనే మితిమీరిన విశ్వాసం వల్ల ముఖ్యమంత్రి రోశయ్యపై విమర్శలు చేస్తూనే అధిష్టానం అండదండలతో ముందుకు సాగాలనే ఆయన వ్యూహాన్ని జగన్ అనుసరించారని భావిస్తున్నారు.పార్టీ అధిష్టానం కళ్లెం వేసేందుకు సిద్ధపడడంతో జగన్ కు నాయకులంతా దూరం జరుగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+