హైదరాబాద్: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వేరు కుంపటి పెట్టబోరని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. జగన్ వేరు కుంపటి పెడతారని వచ్చిన వార్తలను ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. జగన్ కాంగ్రెసు కుటుంబ సభ్యుల్లో ఒక్కరని ఆయన అన్నారు.
జగన్ ఒంటరివాడు కాడని ఆయన అన్నారు. జగన్ ఏకాకి అంటూ వచ్చిన వార్తాకథనాన్ని ఆయన వ్యతిరేకించారు. తామంతా రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నామని, కలిసే ఉంటామని ఆయన చెప్పారు.