ఓదార్పు యాత్ర వాయిదాకు వైయస్ జగన్ యోచన

అయితే చివరి నిమిషం వరకు పార్టీ అధిష్టానం నుంచి అనుమతి సాధించేందుకు ప్రయత్నాలు మాత్రం సాగించాలని అనుకుంటున్నారు. అధిష్టానం అనుమతి లభిస్తుందనే ఆశ కూడా జగన్ కు ఉన్నట్లు చెబుతున్నారు. కొందరు మంత్రులు శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తన ఓదార్పు యాత్రకు అనుకూలంగా మాట్లాడడం ఆయనకు కొంత ఊరటనిస్తోంది. పార్టీ అధిష్టానం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే జగన్ ఆదివారం సాయంత్రం గానీ, సోమవారం ఉదయం గానీ యాత్రను వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. జగన్ ఓదార్పు యాత్రను వాయిదా వేసుకోవడమే మంచిదని ఆయనకు అత్యంత సన్నిహితుడైన శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి కూడా అన్నారు. దీన్ని బట్టి శాసనసభ్యుల మనోగతాన్ని అర్థం చేసుకోవవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications