హైదరాబాద్: జస్టిస్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలోని కమిటీ ఈనెల 8నుంచి 10వ తేదీవరకు హైదరాబాద్ లో అభిప్రాయ సేకరణ చేపడుతుంది. ఈ కమిటీ జూబ్లీహాలులో 8,9 తేదీల్లో నిర్వహించే సమావేశంలో పలు ప్రజాసంఘాలు తమ అభిప్రాయాలను కమిటీకి తెలియజేస్తాయి. చివరిరోజు 10వ తేదీన లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో పలు సంఘాలు కలిసి తమ నివేదికలు అందజేస్తాయి.
రాష్ట్రంలోని పరిస్ధితులపై శ్రీకృష్ణ కమిటీ ఈ ఏడాది డిసెంబర్ 31 లోపు నివేదిక అందజేయవలసి ఉంది. సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణ డిమాండ్లను కమిటీ ప్రత్యేకంగా పరిశీలిస్తుంది.