తెలంగాణ ప్రజల చీలికకు సీమాంధ్ర నేతల కుట్ర: కోదండరామ్

ఉప ఎన్నికల్లో పోటి చేయాలంటే తమకేమీ భయం లేదని, ఇతర పార్టీల వ్యవహారశైలిపైనే అనుమానాలున్నాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెసు పోటీ చేయడం అనైతికమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ నేతల వ్యవహార శైలి భయాందోళనలకు గురిచేస్తోందని ఆయన అన్నారు. డిసెంబర్ 9వ తేదీన కేంద్రం చేసిన ప్రకటనను సీమాంధ్ర నాయకులు అడ్డుకున్నారని ఆయన అన్నారు. రాజీనామాలతో తెలంగాణ సాధించుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుతో సహా తెలంగాణ నాయకులు, జేఏసీ నేతలు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్ధి జేఏసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అలాగటు ఉప ఎన్నికల్లో ముందుకు ఏ విధంగా పోవాలి, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలియవచ్చింది.












Click it and Unblock the Notifications