విశాఖపట్నం: విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యలమంచిలి సమీపంలో కొక్కురాపల్లి వద్ద ఎన్ హెచ్-5 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న లారీని స్కార్పియో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో మరో ముగ్గురు త్రీవంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖపట్నం అక్కయ్యపాలెంకు చెందినవారు స్కార్పియోలో ఉప్మాక వద్ద పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.