హైదరాబాద్: మెదక్ జిల్లాకు చెందిన గర్భిణి (28) స్థానిక గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. విశాఖ జిల్లాలో రెండు రోజుల క్రితం స్వైన్ ఫ్లూతో మృతిచెందిన అప్పన్న భార్యకు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
త్వరలో శంషాబాద్ విమానాశ్రయంలో స్వైన్ ఫ్లూ పరీక్షా కేంద్రం ఏర్పాటుచేయనున్నట్లు ఆరోగ్యశాఖమంత్రి దానం నాగేందర్ తెలిపారు. ఇది వరకే హైదరాబాదులోని రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.