హై కమాండ్ ను కాదంటే జగన్ కు మనుగడ ఉండదు: యాష్కీ

Madhu Yashki
హైదరాబాద్: ఓదార్పు యాత్రను చేపట్టవద్దని పార్టీ అధిష్టానం ఆదేశించిందని, అధిష్టానం ఆదేశాలను ధిక్కరిస్తే తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు మనుగడ ఉండదని కాంగ్రెసు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ గౌడ్ అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను ముఖ్యమంత్రిని చేయాలా, వద్దా అనేది పార్టీ అధిష్టానం అభిప్రాయం మీదనే ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే సరిపోదని, అందుకు అధిష్టానం ఆశీస్సులు ఉండాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. డిఎస్ తన రాజకీయ గురువు అని, డిఎస్ ఎంత ఎదిగితే అంత సంతోషిస్తానని, ఉప ఎన్నికల్లో డిఎస్ గెలవాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి రోశయ్యను గద్దె దించడానికి పార్టీలోని ఒక వర్గం కుట్ర చేస్తోందని, అందుకే రోశయ్యను బిసి వ్యతిరేకిగా చిత్రించే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణలోని ఉప ఎన్నికల్లో అంతిమ తీర్పు ప్రజలేదనని, అయితే ఈ ఎన్నికలు తెలంగాణవాదానికి ప్రతీకలు కావని ఆయన అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే తాను ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు. కాంగ్రెసుతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని ప్రజలను పార్టీ ఒప్పించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేసిందని, అయితే సీమాంధ్ర నాయకుల కుట్ర వల్ల వెనక్కి వెళ్లిందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం నాయకుల చేతుల్లోంచి ప్రజల్లోకి వెళ్లిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటే రాజకీయ నాయకులు తెలంగాణలో తిరగలేరని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+