రామోజీ ఈనాడుపై సాక్షి డైలీ మరోసారి దాడి

Sakshi
హైదరాబాద్‌: రామోజీరావు నేతృత్వంలో ఈనాడు దినపత్రిక వార్తాకథనంపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక మరోసారి దాడి చేసింది. ఫీజు రీయంబర్స్ మెంటు విషయంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య వైయస్ దేవుడు, నేను రాక్షసుడ్నా అని ప్రశ్నించినట్లు ఈనాడు దినపత్రిక రాసిన వార్తాకథనంపై విరుచుకుపడుతూ సాక్షి దినపత్రిక బుధవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. వైయస్ హయాంలో కూడా బకాయిలున్నాయంటూ రోశయ్య వ్యాఖ్యానించినట్లు వచ్చిన అభిప్రాయంపై కూడా సాక్షి తీవ్రంగా ధ్వజమెత్తింది. మహానేతపై మహాపనింద అంటూ సాక్షి ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది. ప్రస్తుత ప్రభుత్వ తప్పుల్ని వైయస్ రాజశేఖర రెడ్డిపై రుద్దే ప్రయత్నానికి ఈనాడు ఒడిగట్టిందని దుయ్యబట్టింది. వైయస్ ఎలాగూ వచ్చి జవాబు చెప్పలేరు కాబట్టి నిందలు మోపుతోందని వ్యాఖ్యానించింది.

ఈనాడు దినపత్రిక వార్తాకథనాన్ని ఆసరాగా తీసుకుని రోశయ్య ప్రభుత్వంపై కూడా సాక్షి దినపత్రిక విమర్సలు గుప్పించింది. బీసి ఫీజుల రీయంబర్స్ మెంటుకు వైయస్ హయాంలో బడ్జెట్ కు మించి నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. వైయస్సార్ మరణం తర్వాతనే పథకానికి చిక్కులు మొదలయ్యయాని సాక్షి తప్పు పట్టింది. బకాయిలు చెల్లించకుండా ప్రస్తుత ప్రభుత్వం పెంచుకుంటూ వచ్చిందని, దీంతో బకాయిలు తడిసి మోపడయ్యాయని విమర్శించింది. ఇప్పుడు వాటిని చెల్లించలేక ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నట్లు అభిప్రాయపడింది. ఎడాపెడా అన్ని చార్జీలు పెంచుతున్నా డబ్బుల్లేవంటూ ప్రభుత్వం బీదరుపులు అరుస్తోందని సాక్షి వార్తాకథనం వ్యాఖ్యానించింది.

ఆ రకంగా వైయస్సార్ పై మరో కుట్ర ప్రారంభమైందని సాక్షి ఆరోపించింది. వైయస్ హయాంలో ఫీజు రీయంబర్స్ మెంటు పథకాన్ని ఎలా అమలు చేసిందీ సాక్షి వివరించింది. ఇప్పుడు బకాయిలు ఎలా పేరుకుపోయాయో వివరించింది. గణాంకాలతో వాటిని సాక్షి దినపత్రిక వివరించింది. ప్రభుత్వ ప్రస్తుత ప్రతిపాదన పేద విద్యార్థుల ఆగ్రహానికి గురవుతోందని సాక్షి వ్యాఖ్యానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+