పాకిస్ధాన్ ఆత్మాహుతి దాడిలో 104 కు చేరిన మృతుల సంఖ్య
International
oi-Santaram
By Santaram
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడి ఘటనలో శనివారంనాటికి మృతుల సంఖ్య 104కు చేరింది. గాయపడినవారిసంఖ్య 110కి పెరిగింది.సహాయ కార్యక్రమాలు చేపట్టిన రిస్క్యూ బృందం ఇప్పటివరకు 36 మృత దేహాలను వెలికి తీసింది. ప్రభుత్వ కార్యాలయాను టార్గెట్ చేసుకుని, పాకిస్తాన్‌లోని ఓ గిరిజన గ్రామం.. జన సమర్ధంగా ఉన్న ప్రాంతంలో శుక్రవారం ఆత్మాహుతి దళ సభ్యుడు మోటారు వాహనంపై వచ్చి తనకు తానుగా పేల్చుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్న విషయం విదితమే. కాగా అక్కడ ఉన్న ఓజైలు ప్రహరీగోడ కూడా బాంబు దాటికి కూలిపోవడంతో జైలులో ఉన్న ఖైదీల్లో 36 మంది పారిపోయారు. ఇంకా సహాయకార్యక్రమాలు జరుగుతున్నాయి.