మహా దౌర్జన్యంపై తిరగబడ్తాం, విప్లవం తెస్తాం: బాలకృష్ణ

తమ పార్టీ నాయకులను తీవ్రవాదుల మాదిరిగా, ఉగ్రవాదులలాగా చూస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం భూములను కబ్జా చేసి సంపన్నులకు కట్టబెడుతోందని, ఇటీవలే సినీ పరిశ్రమకు చెందిన భూమిని అక్రమంగా సంపన్నులకు కట్టబెట్టే ప్రయత్నాన్ని చూశామని ఆయన చెప్పారు. సోంపేట వంటి సంఘటనలు చూస్తే కాంగ్రెసు ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో అర్థమవుతుందని ఆయన అన్నారు. అప్రజాస్వామికంగా సంపన్నులకు ప్రజా సంపదను దోచి పెడుతున్నారని ఆయన అన్నారు. తాను చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం నాయకులను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో కూడా తెలియడం లేదని, వారిని ఎక్కడ ఉంచుతారో తేలిన తర్వాత పరామర్శకు వెళ్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications