డ్యూస్ బర్గ్: జర్మనీలోని డ్యూస్ బర్గ్ నగరంలో నిర్వహించిన ఓ సంగీత విభావరిలో తొక్కిసలాట జరిగి 18 మంది మృతి చెందారు. మరో 100 మంది గాయపడ్డారు. ఈ విభావరికి ప్రజలు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జర్మనీ ఛాన్సెలర్ అంజెలామార్కెల్ మృతుల కుంటుంబాలకు తమ సంతాపాన్ని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు.