వైయస్ జగన్ వరంగల్ జిల్లా ఓదార్పు కొంప ముంచిందా?

YS Jagan
హైదరాబాద్: వరంగల్ జిల్లా ఓదార్పు విషయంలో పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పట్టిన మొండిపట్టు తెలంగాణ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు కొంప ముంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెసు ఓటమికి, తెలుగుదేశం పార్టీ ఘోర వైఫల్యానికి తెలంగాణ సెంటిమెంటు ప్రధాన కారణమని భావిస్తున్న విశ్లేషకులు వైయస్ జగన్ వరంగల్ జిల్లా ఓదార్పు యాత్రను చేపట్టడానికి నడిపిన నాటకం మరింతగా సెంటిమెంటు బలపడడానికి కారణమైందని అంటున్నారు. కాంగ్రెసు తెలంగాణ నాయకులు, తెలంగాణ జెఎసి నాయకులు చెబుతున్నా వినకుండా, పార్టీ అధిష్టానం సూచించినా లెక్క చేయకుండా జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం వల్ల తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని అంటున్నారు. సీమాంధ్రకు చెందిన జగన్ అహంకార ప్రదర్సన తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసిందని భావిస్తున్నారు.

తెలంగాణ నాయకులను చులకన చేస్తూ జగన్ వర్గం చేసిన వ్యాఖ్యలు, పార్లమెంటులో తెలంగాణను వ్యతిరేకిస్తూ ప్లకార్డు ప్రదర్శిస్తూ తన సీమాంధ్ర వైఖరి, తెలంగాణలో పర్యటించి తీరుతాననే ఆధిపత్య ధోరణి తెలంగాణ ప్రజల కడుపు మంటకు కారమైందని అంటున్నారు. తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెసు నాయకులు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు తనను అడ్డుకుంటున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపాయని చెబుతున్నారు. తాను మాత్రమే తెలంగాణను ఉద్దరిస్తాననే ప్రభు వచనాలు కూడా తెలంగాణ ప్రజలకు నచ్చలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ వ్యవహార శైలి వల్ల తెలంగాణ ప్రజల్లో సీమాంధ్ర నాయకుల ఆధిపత్య ధోరణి బాహాటంగా ముందుకు రావడంతో తెలంగాణ ప్రజల్లో సెంటిమెంటు మరింతగా బలపడిందనే వ్యాఖ్య వినిపిస్తోంది. వైయస్ కోసం మరణించినవారు తప్ప, తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు జగన్ పట్టనప్పుడు తెలంగాణకు జగన్ మేలు చేసేందుకు రావడం లేదనే భావన బలంగా నాటుకుపోయిందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+