తెలంగాణ ఉప ఎన్నికలపై సాక్షి మార్కు విశ్లేషణ

తెలంగాణ కాంగ్రెసు నాయకులను ఉప ఎన్నికల్లో బాధ్యులను చేస్తూ వ్యాఖ్యానాలు చేసింది. అనవసరమైన వ్యాఖ్యల ద్వారా పార్టీలో కుమ్ములాటలకు వారు కారణమయ్యారని వ్యాఖ్యానించింది. జగన్ వరంగల్ ఓదార్పు యాత్రను తెలంగాణ కాంగ్రెసు నాయకులు వ్యతిరేకించడంపై పరోక్ష వ్యాఖ్యలు గుప్పించింది. అదే సమయంలో జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు నాయకులు పార్టీలోని తమ ప్రత్యర్థులపై కత్తులు దూశారు. ఎన్నికల ప్రచారం నిర్వహించి గెలుపు బాటలో నడిపించే నాయకుడు లేకుండా పోయారని మాజీ కొండా సురేఖ లాంటి నేతలు వ్యాఖ్యానించారు. గెలుపు బాధ్యతను ఏ ఒక్కరు కూడా స్వీకరించలేకపోయారని విమర్సించారు. సమర్ధుడైన నాయకుడు లేకుండా పోయాడని, అందుకే కాంగ్రెసు ఓడిపోయిందని విమర్సించారు. మొత్తం మీద, జగన్ కు నాయకత్వం అప్పగించకపోవడం వల్లనే కాంగ్రెసు ఉప ఎన్నికల్లో ఓడిపోయిందనే అర్థం వచ్చేలా సాక్షి చానెల్ వార్తాకథనం, జగన్ వర్గీయుల వ్యాఖ్యలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications