హైదరాబాద్: సినీ పరిశ్రమలో ఉన్న పేద కళాకారులకు తాము నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రముఖ దర్శకుడు, కాంగ్రెసు నాయకుడు దాసరి నారాయణరావు అన్నారు. టాలీవుడ్ కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలకు గ్లోబల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజుల పాటు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని దాసరి నారాయణరావు లాంఛనంగా ప్రారంభించారు. నిర్మాత రామానాయుడు, నటులు కృష్ణ, కృష్ణంరాజు, మా అధ్యక్షుడు మురళీమోహన్, ఏవీఎస్, పలువురు నిర్మాతలు ఈ ఆరోగ్య శిబిర కార్యక్రమానికి హాజరయ్యారు.