గాలి బ్రదర్స్ ను టార్గెట్ చేసుకున్న చంద్రబాబు

రాష్ట్రంలోని ఖనిజ వనరులను ఇష్టమైన వారికే అప్పగిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. 30 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇనుపఖనిజం అక్రమంగా ఎగుమతైనట్లు కర్ణాటక అంచనా వేసిందని ఆయన అన్నారు. ఖనిజం తరలింపు సమయంలో అనేకమంది మరణిస్తున్నారని చెప్పారు. మైనింగ్ మాఫియాను అరికట్టాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇష్టమైన వారికి ప్రభుత్వం మైనింగ్ తవ్వకాలు అప్పగిస్తోందని ఆయన విమర్శించారు. విదేశాలకు ఇనుప ఖనిజం ఎగుమతిని నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications