వైయస్ జగన్ తెలంగాణ ద్రోహి: ఈటెల రాజేందర్

ఓదార్పు యాత్ర తదితర విషయాలు అరిగిపోయిన రికార్డులని విమర్శించారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ అంటూ చంద్రబాబు మతిలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉన్నత విద్యామండలి ఏర్పాటై 22 ఏళ్త్లెనా ఇప్పటికీ తెలంగాణ వ్యక్తికి ఛైర్మన్ పదవి ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు కూడా కేసీరెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని చూడటం దుర్మార్గమని ఈటెల వ్యాఖ్యానించారు. ఈ సారైన తెలంగాణ వ్యక్తికి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి 20 టిఎంసిల నీటిని ఎల్ఎండీకి విడదుదల చేసి కరీంనగర్, వరంగల్ లకు మంచినీరు అందించాలని ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను కోరారు.












Click it and Unblock the Notifications