డిఎల్ రవీంద్రారెడ్డి, జెసి దివాకర్ రెడ్డిపై సాక్షి డైలీ మండిపాటు

Sakshi
హైదరాబాద్: ఎపిఐఐసి కుంభకోణంపై మాట్లాడిన కాంగ్రెసు శాసనసభ్యులు డిఎల్ రవీంద్రారెడ్డి, జెసి దివాకర్ రెడ్డిలపై సాక్షి దినపత్రిక తీవ్రంగా మండిపడింది.నీతిరీతి లేని నీచవాచాలం, దివంగత వైయస్ లక్ష్యంగా అవాకులు...చవాకులు అంటూ సాక్షి దిన పత్రిక వారిని తప్పు పట్టింది. వ్యంగ్యమూ, వెటకారమూ...నవరసాల్లో విమర్శలు స్వపక్షంలోనే భారీ కుట్ర...ఆయన్ను ఆప్రతిష్టపాలు చేయడమే లక్ష్యం..తెర వెనుక శక్తులు కొన్ని...తెర ముందు శల్యులు కొందరు...సొంతంగా ఆరోపణలు చేయడం లేదా విపక్షాలకు ఉప్పందించడం, చిరంజీవి, బాబు ఆరోపణలకు వంత పాడుతూ సొంత పార్టీకే గోతులు, వైయస్ కు ఎంత వ్యతిరేకంగా మాట్లాడితే అంత గొప్ప నాయకుడై పోవచ్చునన్నట్లు నిందారోపణలు అంటూ సాక్షి దిన పత్రిక ఆడిపోసుకుంది.

ఎపిఐఐసి భూములు అప్పగిస్తున్నప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు చిట్టా విప్పుతామని అంటున్నారని, వైయస్ తిరిగి రాలేరు - సమాధానం ఇచ్చుకోలేరు - అదే వారి ధీమా అంటూ సాక్షి రాసింది. వైయస్ రాజశేఖర రెడ్డిపై ఓ దారుణమైన కుట్ర ప్రారంభమైందని ఆరోపించింది. వైయస్ నిర్ణయాల్లో పాలు పంచుకున్నవారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించింది. పిఆర్పీ నాయకుడు చిరంజీవి ఆరోపణలు చేస్తే అందులో తప్పేముందని కాంగ్రెసు సీనియర్లు కె కేశవరావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సమర్థించారని కూడా వాపోయింది. మొన్న అదే మాట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటే వెనకేసుకచొచ్చారని సాక్షి దినపత్రిక తప్పు పట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+