కెవిపి రామచందర్ రావు అక్రమాల చిట్టా విప్పుతా: కెసిఆర్

ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో పేదల కడుపులు కొట్టి గజదొంగలకు ఇచ్చారని, ఎపిఐఐసిని దివాళా తీయించారని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చలువేనని ఆయన వ్యాఖ్యానించారు. భూముల యజమానులకు నామమాత్రంగా చెల్లించారని ఆయన అన్నారు. 4 నుంచి 40 సర్వే నెంబర్ల వరకు డీనోటిఫై చేసి పేదలకు తిరిగి ఆ భూములను ఇప్పించాలని ఆయన కోరారు. సినీ నటి విజయనిర్మలకు సంబంధించిన 14 ఎకరాలను, ఓ మహిళా మంత్రికి చెందిన 3 ఎకరాలను డీనోటిఫై చేసి, పేదల భూములను నోటిఫై చేయడం లేదని ఆయన అన్నారు. మణుగూరు ఓపెన్ కాస్ట్ వ్యవహారాన్ని ఆయన వ్యతిరేకించారు. గిరిజనుల హక్కులను కాలరాస్తూ అక్కడ ఓపెన్ కాస్ట్ ను ప్రారంభించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన అన్నారు. బయ్యారం గనుల విషయంలో కూడా వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.
తనపై విమర్శలు చేస్తున్న తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డివి పిచ్చి ప్రేలాపనలని ఆయన అన్నారు. ఆర్డీఎస్ ఎక్కడుందో కూడా అంతకు ముందు నాగం జనార్దన్ రెడ్డికి తెలియదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండగా దాన్ని వెలుగులోకి తెచ్చింది తానేనని ఆయన చెప్పుకున్నారు. నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ బిడ్డ, ఆయనను అనడం తనకు ఇష్టం లేదని, అయితే ప్రజల్లో ఆయనే చులకనవుతారని కెసిఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications