వైయస్ జగన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారు: మధు యాష్కీ

Madhu Yashki
హైదరాబాద్: ఆస్తులను కాపాడుకోవడానికి కొంత మంది తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ విమర్శించారు. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటే పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం ఖాయమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ సహా ఎంత పెద్దవారైనా పార్టీ అధిష్టానం మాటకు కట్టుబడి నడుచుకోవాల్సిందేనని ఆయన అన్నారు. అధిష్టానం సహనాన్ని అసమర్థతగా భావించరాదని ఆయన హితవు పలికారు.

తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17వ తేదీని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించబోదని ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రకటించడం బాధాకరమని ఆయన అన్నారు. దాని వల్ల తెలంగాణ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకమనే భావన తెలంగాణ ప్రజల్లో నాటుకుపోతుందని ఆయన అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాల మాదిరిగా సెప్టెంబర్ 17వ తేదీ ఉత్సవాలను అధికార కార్యక్రమంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ విషయంపై మరోసారి తాను ముఖ్యమంత్రిని కలుస్తానని, పార్టీ అధిష్టానం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+