మన్నవరం ప్రాజెక్టు తరలిపోదు, పిఎం వస్తారు: సిఎం రోశయ్య

మన్నవరం ప్రాజెక్టుకు ఈ నెల 31వ తేదీన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేస్తారని ఆయన చెప్పారు. అయితే ఇంకా ప్రధాని ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారు కాలేదని ఆయన చెప్పారు. ప్రధాని పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఖరారు కాలేదని ఆయన చెప్పారు. మన్నవరం ప్రాజెక్టు శంకుస్థాపన ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఈసారైనా జరుగుతుందా అనే సందేహం పూర్తిగా వీడిపోలేదు. కాగా, ఈ ప్రాజెక్టును తమిళనాడుకు తరలించుకుపోవడానికి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరిగింది.












Click it and Unblock the Notifications