వైయస్ జగన్ సమస్య పరిష్కారానికి తెలంగాణ మంత్రదండం?

తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ బలం పుంజుకోవాలంటే రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, అదే సమయంలో పార్టీపై జగన్ ప్రభావం పడకుండా, సీమాంధ్రలో చిరంజీవి వంటి శక్తుల మద్దతుతో పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెసు అధిష్టానం యోచిస్తున్నట్లు ఆ పత్రిక రాసింది. ఈ నేపథ్యంలో జగన్‌కు ఉద్వాసన పలకడం లేదా తనంతట తాను తప్పుకొనేలా చేయడం, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఏకకాలంలో జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు కూడా పార్టీ అధిష్టానం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా గడువు లోపలే శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజనపై కమిటీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా జగన్ పై, తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే మరో మూడేళ్లలో ఎన్నికలు వచ్చేనాటికి పార్టీని రెండు ప్రాంతాల్లోనూ బలోపేతం చేయవచ్చునని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications