మన్నవరం ప్రాజెక్టు వైయస్ ఘనతే: ప్రధాని మన్మోహన్ సింగ్

Manmohan Singh
మన్నవరం: వైఎస్‌ కృషి వల్లే మన్నవరంలో ఎన్టీపీసీ-భెల్‌ ప్రాజెక్టు ఏర్పాటు అవుతోందని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. మన్నవరం ప్రాజెక్టుకు బుధవారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. మన్నవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. వైయస్ వర్ధంతికి ఒక్క రోజు ముందుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం కూడా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన త్వరితగతిన జరిగేందుకు కృషి చేసిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి అభినందనీయులని ఆయన అన్నారు. విద్యుదుత్పత్తి, సరఫరా మధ్య వ్యత్యాసం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రూ. 6 వేల కోట్ల వ్యయంతో ప్రారంభమవుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం ఐదేళ్లల్లో పూర్తి అవుతుందని వెల్లడించారు. ఐదేళ్లలో 5వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవసరమైన పరికరాలను దేశీయంగా ఈ ప్రాజెక్టు తయారు చేస్తుందని స్పష్టం చేశారు.

గత ఆరేళ్లలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేశామని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి తరఫున ప్రసంగాన్ని చదివిన ఆయన మన్నవరం ప్రాజెక్టు కోసం వైఎస్‌ ఎనలేని కృషి చేశారని కన్నా అన్నారు. 11వ పంచవర్ష ప్రణాళికలో 60 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సుశీల్‌కుమార్‌ షిండే వెల్లడించారు. 2012 లోగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలను విద్యుదీకరించనున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+