ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాల్సి వస్తుందా?

పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి నాయకులు కూడా అదే వాదన చేస్తున్నారు. ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం పాటించాలని, అందువల్ల రెండు ప్రాంతాలవారికి కూడా ఒకే ప్రశ్న పత్రం ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఒక ప్రాంతంలో పరీక్షను రద్దు చేయడం, మరో ప్రాంతంలో రద్దు చేయకపోవడం కుదరదని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షను రద్దు చేయాల్సిందేనని అంటున్నారు. తాము న్యాయవాదులను కూడా సంప్రదించామని వారు చెబుతున్నారు. మొత్తం మీద, గ్రూప్ వన్ పరీక్షపై నీలినీడలు అలుముకున్నాయి. పరీక్షను పూర్తిగా రద్దు చేయాలా, కొన్ని సెంటర్లలోని తిరిగి నిర్వహించాలా అనేది సందేహంగానే ఉంటుంది.












Click it and Unblock the Notifications