నాగార్జునరెడ్డి బాటలో మరో హైకోర్టు జడ్జి నూతి రామ్మోహనరావు

High Court
హైదరాబాద్: న్యాయమూర్తి నాగార్జునరెడ్డి బాటలోనే మరో న్యాయమూర్తి రాజీనామాకు సిద్ధపడ్డట్టు ప్రచారం జరుగుతోంది. మరో హైకోర్టు జడ్జి నూతి రామ్మోహనరావు కూడా రాజీనామా బాట పట్టనున్నట్టు తెలుస్తోంది. ఐతో దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఘటనలు ఆయన్ను సైతం తీవ్రంగా కలిచివేసినట్టు చెబుతున్నారు. న్యాయవాదులు కోర్టు ధిక్కారానికి పాల్పడటం, కుర్చీలు విరగ్గొట్టడం వంటి అనారోగ్య చర్యలకు పాల్పడటంతో ఆయన మలస్థాపం చెంది, రాజీనామాకు సిద్ధపడ్డట్టు తెలుస్తోంది.

కాగా ఏలూరు బార్ అసోసియేషన్ ఈ వివాదాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లింది. పవిత్రమైన న్యాయస్థానం, అందులోనూ హైకోర్టులో న్యాయవాదులు చేస్తున్న నిరసనలు, కార్యక్రమాలను వారు ఖండించారు. వారికి న్యాయం కావాలంటే ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలి కాని ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడకూడదన్నారు. హైకోర్టు ఎదుట న్యాయవాదులు రౌడిల్లా వ్యవహరిస్తున్నారని వైజాగ్ లాయర్లు విమర్శించారు. వారిపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటప్పుడే మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+