వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది రవీంద్రనాథరెడ్డి చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

ఆక్రమ ఎరువుల లారీలను గుట్టుచప్పుడు రహస్యప్రాంతాలకు తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం బాలాజీ ఫర్టిలైజర్స్ నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డులను పరిశీలిస్తే ఎరువుల ఈ విషయం వెలుగుచూసింది. కాకతాళీయంగా ఆరు లారీలు పట్టబడినా, పదుల సంఖ్యలో లారీలు అక్రమ లారీలు వెళ్లినట్టు భావిస్తున్నారు.లారీల ఆచూకీ లేకపోవడంతో వాటిలోని ఎరువులకు సంబంధించిన డెలివరీ చలానాలను సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. ఎరువుల లారీలను పక్క జిల్లాలకు పంపినట్లు గుర్తించిన పోలీసులు ఈ దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు.పకడ్బందీగా ఆధారాలను సేకరించి మేయరు రవీంద్రనాథ్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఎరువుల అక్రమ రవాణా బాగోతం తనకు చుట్టుకుంటుందని కడప మేయరు రవీంద్రనాధ్‌రెడ్డి భావించి, ముందుగానే హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకున్నారు. కాగా రవీంద్రనాధ్‌రెడ్డి తో పాటు ఆయన భాగస్వాముల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరాదని ఎస్పీ ఉత్తర్వులను ఫాక్స్ చేశారు.












Click it and Unblock the Notifications