కాంగ్రెసులో కెసిఆర్ చిచ్చు: నాయకుల మధ్య తెలంగాణ రగడ

కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మధు యాష్కీ, మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్ రెడ్డి, జి వివేక్ లపై రాష్ట్ర మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, దామోదరం రాజనరసింహ తీవ్రంగా మండిపడ్డారు. వారిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని మంత్రులు ముఖ్యమంత్రిని కోరారు. మంత్రులపై మధు యాష్కీ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూడా పార్లమెంటు సభ్యులనే వెనకేసుకొచ్చారు. దానం నాగేందర్, ముఖేష్ కొంత కాలం గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర డిమాండును ముందుకు తెచ్చారు. పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు అనుకూలంగా కూడా వ్యవహరించారు. అయితే, క్రమంగా వెనక్కి తగ్గుతూ వచ్చారు. కానీ వారు తీవ్రమైన తెలంగాణవాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. మొత్తం మీద, కాంగ్రెసులో విభేదాలు పెంచి తెలంగాణకు మెజారిటీ తెలంగాణ నాయకులను అనుకూలంగా మలచాలనే కెసిఆర్ వ్యూహం ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications