వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాపార ప్రయోజనాలకు, వృద్ధికి ఇంటర్నెట్ ఎలా ఉపయోగపడుతుంది?

By Pratap
|
Google Oneindia TeluguNews

Internet
ముంబై: ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యాపారాన్ని ప్రారంభించి, స్థిరంగా కొనసాగించడం చాలా క్లిష్టమైన పనిగా మారింది. నూతన వ్యాపారవేత్తలు పరుగు పందెంలో ముందుకు సాగడానికి పాత పద్ధతులతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకోవాల్సి ఉంటుంది. లక్షలాది ప్రజల నిత్యజీవితంలో ఇంటర్నెట్ కమ్యూనికేషన్ విషయంలో అత్యంత ముందంజలో ఉంది. కానీ కొన్ని అసందర్భమైన కారణాల వల్ల వ్యాపారంలో ఇంటర్నెట్ వాడకం తక్కువగానే ఉంది. అయితే వ్యాపారమేదైనా ఇంటర్నెట్ కీలకమైన పాత్ర పోషించగలదు.

అనేక రకాలుగా వరల్డ్ వైడ్ వెబ్ ప్రధాన పాత్ర వహించేందుకు అవకాశాలున్నాయి. మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్, ప్రతిష్ట పెంపుదల, విశ్వసనీయత సాధన, క్లయింట్లతో సంప్రదింపులూ సమచార వినిమయం వంటి వాటికి ఇంటర్నెట్ ఇతోధికంగా ఉపయోగపడుతుంది. మారుమూల సేవలందించడానికి, ఆన్ లైన్ లావాదేవీలకు మాత్రమే కాకుండా అటువంటి వాటికి కూడా ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు.

బ్లాగ్స్ ను ఏర్పాటు చేసుకోవడం మాత్రమే ఇంటర్నెట్ విషయంలో ప్రధానం కాదు. అలా ఆన్ లైన్ లో ఉండడం అంత ఉపయోగకరమైందేమీ కాదు. వ్యక్తిగత నియమనిబంధనలతో వస్తారనే విషయం మనకు తెలుసు. బ్లాగ్ లోని విషయం బ్లాగర్ కు సంబంధించిందే అయినప్పటికీ డొమైన్, ప్లాట్ ఫారం ప్రాపర్టీస్ గూగుల్ కు సంబంధించినవి. సేవా విధానంలో కొద్ది ఉల్లంఘనకైనా అకౌంట్ ను నిలిపేయవచ్చు, విషయం పూర్తిగా కనిపించకుండా పోతుంది. అందువల్ల ఆన్ లైన్ లో మీ వ్యాపారం కొనసాగాలంటే ప్రత్యేకంగా డొమైన్ పేరు ఉండాలి. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, కస్టమర్లకు లేదా క్లయింట్లకు ఆ డొమైన్ చిరునామా. మీ ఉత్పత్తులకు, సేవలకు సంబందించి సమాచారాన్ని దాని ద్వారా అందించడానికి వీలవుతుంది.

బ్లాగ్ మాదిరిగా కాకుండా డొమైన్ పేరు నమోదు చేసుకున్న వ్యక్తికి మాత్రమే సంబంధించింది, అతనికి మాత్రమే చెందుతుంది. ఒక వ్యక్తి కలిగి ఉన్న డొమైన్ లాంటి డొమైన్ ను మరో వ్యక్తి పొందలేడు. .in, .edu, .org, .net వాటి ద్వారా డొమైన్ ను రూపొందించుకోవచ్చు. వ్యాపారులకు .com సరైంది. .com వాణిజ్యానికి లేదా ఇ - కామర్స్ కు లేదా వాణిజ్య వాడకానికి సంబంధించింది. yourbusinessname.com, brandname.com లాగా డొమైన్ పేర్లను నమోదు చేసుకోండి.

నమోదు చేసుకునే ముందు ఒక విషయాన్ని గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీ డొమైన్ నమోదు చేసుకుని ఎంత కాలమైంది, ఎన్నేళ్ల కోసం నమోదు చేసుకున్నారనే ప్రమాణాలపై సెర్చ్ ఇంజన్లలో మీ వైబ్ సైట్ విశ్వసనీయత, క్రెడిబిలిటి ఆధారపడి ఉంటుంది. గూగుల్, ఇతర ప్రముఖ సెర్స్ ఇంజన్లలో మీ వెబ్ సైట్ రావాలంటే ఎక్కువ కాలానికి డొమైన్ ను నమోదు చేసుకోండి.

డొమైన్ పేరు నమోదు చేసుకున్న తర్వాత ప్రత్యేకమైన, శాశ్వతమైన ఇమెయిల్ చిరునామాను సృష్టించుకోవాలి. దీని వల్ల ఇంటర్నెట్ లో మీ వ్యాపార మనుగడ ఎక్కువ కాలం ఉండడానికి వీలవుతుంది. సొంత డొమైన్ ఏర్పాటు వల్ల సాఫ్ట్ వేర్ పై, వెబ్ సైట్ ఏర్పాటుపై పూర్తి నియంత్రణ లభిస్తుంది. అంతేకాకుండా, వర్గ్ ప్రెస్ వంటి సిఎంఎస్ లోడ్ చేసేందుకు, స్పెషల్ స్క్ర్రప్టులను చేర్చడానికి హెచ్ టిఎంఎల్ వాడడానికి వీలవుతుంది. డొమైన్ హోస్టింగ్ వల్ల మీ ఇమేజ్ ను పెంచకోవడానికి వెసులుబాటు కలుగుతుంది.

ఇంకా ఆలస్యమెందుకు, ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ వ్యాపారాన్ని విస్తరించుకోండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X