సోనియా ఇంటి వద్ద టిడిపి ధర్నా: కెసిఆర్ చిర్రుబుర్రు

కాగా, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే అడ్డుపడ్డారని కెసిఆర్ అన్నారు. కరీంనగర్ సభలో ఆయన తెలుగుదేశం పార్టీపై దుమ్మెత్తిపోశారు. డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు తెలంగాణకు అడ్డుపడ్డారని ఆయన అన్నారు. తెలంగాణ కోసం సోనియా ఇంటి ముందు కాకుండా చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలని ఆయన అన్నారు. చంద్రబాబు శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇస్తే తెలంగాణ వెంటనే ఏర్పడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ, ఆంధ్ర భార్యాభర్తలు విడాకులు తీసుకున్నట్లుగా ఎప్పుడైనా విడిపోవచ్చునని నెహ్రూయే చెప్పారని ఆయన అన్నారు.
తెలంగాణలో తమ పార్టీని తుడిచిపెట్టడానికి కెసిఆర్ శిఖండిలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ కెసిఆర్ చెవిలో చెప్పారా అని ఆయన ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications