రొటీన్ గా మారిన వైయస్ జగన్ ఓదార్పు స్పీచ్ లు

YS Jagan
ఒంగోలు: ఓదార్పు యాత్రలో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చేస్తున్న ప్రసంగాలు బోర్ కొట్టిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన ప్రసంగాలు పూర్తి రొటీన్ గా మారాయి. ఏ మాత్రం కొత్తదనం లేక విసిగిస్తున్నాయనే భావన కలుగుతోంది. ఆయన ఓదార్పు యాత్ర ప్రకాశం జిల్లాలో మంగళవారంనాటికి 22 రోజులకు చేరుకుంది. ఆయన ప్రతి చోటా ఒకే ప్రసంగం చేస్తున్నారు. ఒకే రకమైన వాక్య నిర్మాణ పద్ధతి ఉంటోంది. వాక్య విన్యాసాన్ని కూడా మార్చడం లేదు. ప్రజల గుండెలు లబ్ డబ్ లబ్ డబ్ అని కాకుండా వైయస్సార్ వైయస్సార్ అని కొట్టుకుంటున్నాయనేది ఆయన కామన్ డైలాగ్ గా మారింది. దాన్ని కొత్త పద్ధతిలో కూడా చెప్పడం లేదు.

వైయస్సార్ తన ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాల గురించి చెబుతున్నారు. వాటిని కూడా ఒకే క్రమంలో ఒకే పద్ధతిలో చెబుతున్నారు. వరుస కూడా ఆయన మార్చడం లేదు. రెండు సార్లో, మూడు సార్లో తన ప్రత్యర్థులకు ఆయన శాపనార్థాలు పెట్టారు. వైయస్సార్ పై తన ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు ఆయన వారికి శాపనార్థాలు పెట్టారు. రాజకీయాలు నీచ స్థాయికి దిగజారాయని, అది కూడా తన తండ్రి వైయస్సార్ మరణించిన తర్వాతనే దిగజారాయని చెబుతున్నారు. ఇది కూడా వినేవారికి ఊపునిచ్చే రీతిలో లేకపోవడం గమనార్హం.

వైయస్ జగన్ ఎజెండా ఏమిటో తెలియదు గానీ లక్ష్యం మాత్రం అందరికీ తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడం ఆయన లక్ష్యం కాగా దాన్ని ఎలా సాధిస్తారనేది ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉంది. కాంగ్రెసులో ఉంటారా, వేరే పార్టీ పెడతారా అనేది మాత్రమే ఇంకా ఉత్కంఠను కలిగించే విషయం. వైయస్ జగన్ ఇదే రీతిలో ప్రసంగిస్తూ, అదే రీతిలో బాడీ లాంగ్వేజీని ఉంచుకుంటే ఆ ఉత్కంఠ కూడా క్రమంగా తొలగిపోయే ప్రమాదం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+