మహారాష్ట్రలో నలుగురు మావోల అరెస్టు: ఇద్దరు ఆంధ్రులు?
National
oi-Pratapreddy
By Pratap
గడ్చిరోలి: మహారాష్ట్ర పోలీసులు నలుగురు మావోయిస్టులను అరెస్టు చేసినట్లు సమాచారం. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని దనోరాలో ఈ అరెస్టులు జరిగినట్లు సమాచారం. వారిలో ఇద్దరు మహిళా నక్సలైట్లు వార్తలు వస్తున్నాయి. వారిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన మావోయిస్టులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల చేతికి చిక్కిన మావోయిస్టుల్లో అగ్ర నాయకులు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పట్టుబడిన నక్సలైట్ల వద్ద ఎకె47, ఎస్ఎల్ఆర్ దొరికినట్లు భావిస్తున్నారు. ముఖ్యమైన నాయకుల వద్ద మాత్రమే ఆ ఆయుధాలు ఉంటాయి. దాంతో పట్టుబడినవారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులున్నట్లు భావిస్తున్నారు. కాగా, అరెస్టయిన నక్సలైట్లను కోర్టులో హాజరు పరచాలని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు హైదరాబాదులో కోరారు. వారిని ఎన్ కౌంటర్ చేసే ప్రమాదం ఉందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.