తెలంగాణ ఉద్యమం: కేశవ రావు సమన్వయ మంత్రం

తెలంగాణ సాధనలో కాంగ్రెసు పార్టీకి బాధ్యత ఎక్కువగా ఉందని, పార్టీ ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశం ఉందని, తెలంగాణ రాష్ట్రాన్ని తాము తప్పకుండా సాధిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆత్మత్యాగాలు వద్దని ఆయన యువతకు సూచించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులూ ఎత్తివేయించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. కేసుల ఎత్తివేత విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మాజీ హోం మంత్రి, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి చెప్పారు. కేసుల ఎత్తివేత, ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష రద్దు తమ ప్రధాన అంశాలని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications