హైకోర్టు ప్రత్యేక బెంచి కోసం సీమాంధ్ర లాయర్ల ధర్నా

సీమాంధ్ర లాయర్లు చేపట్టిన ధర్నాకు మద్దతును ప్రకటించడానికి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ధర్నా ప్రాంతాన్ని సందర్శించాడు. సీమాంధ్రకు ప్రత్యేక బెంచ్ అవసరమని ఆయన పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్ మాజీ జస్టిస్ సుభాషణ్ రెడ్డి దక్షిణ భారత దేశానికి ఒక సుప్రీంకోర్టు బెంచ్ కావాలని పోరాడుతున్న నేపథ్యంలో సీమాంధ్రులకు కూడా హైకోర్టు బెంచ్ అవసరమని ఆయన ధర్నా కార్యక్రమంలో పేర్కొన్నారు. లాయర్లకు మద్దతు పలికిన వారిలో ఎమ్మెల్యేలు దేవినేని ఉమ, తంగిరాల ప్రభాకర్, మల్లాది విష్ణు ఉన్నారు.












Click it and Unblock the Notifications