నలుగురు అసమ్మతి మంత్రులకు ఉద్వాసన పలికిన యెడ్యూరప్ప

ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ అసమ్మతి శాసనసభ్యులు గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజకు లేఖలు అందించే అవకాశాలున్నట్లు సమాచారం. వారిలో కొద్ది మంది మంత్రులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. రాజకీయాల్లో భాగంగానే సంక్షోభం తలెత్తిందని, తమ పార్టీలో సంభవించిన పరిణామాలపై ప్రచారం అంతా ఉత్తదేనని, బిజెపి ఐక్యంగా ఉందని, యెడ్యూరప్ప నాయకత్వంలో తాము పనిచేస్తున్నామని కర్ణాటక బిజెపి అధ్యక్షుడు కెఎస్ ఈశ్వరప్ప చెప్పారు. కాగా, ప్రతిపక్ష జెడి (ఎస్) నాయకుడు హెచ్ డి కుమారస్వామి బుధవారం గవర్నర్ ను కలిశారు.












Click it and Unblock the Notifications