ఢిల్లీకి పదో తేదీన రోశయ్య: జగన్ క్యాంప్ మంత్రులకు మూడినట్లే?

మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై ఆయన సోనియాతో మాట్లాడుతారని అంటున్నారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. వైయస్ జగన్ వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులకు రోశయ్య ఉద్వాసన చెబుతారనే ప్రచారం జరుగుతోంది. దానిపై రోశయ్య సోనియాతో మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరిపితే ఎలా ఉంటుందనే అంశంపై చర్చించి, లాభనష్టాలను బేరీజు వేసుకుని ముందుకు సాగవచ్చునని అంటున్నారు. రోశయ్య ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications