పోలీసుల నుండి తప్పించుకోవడానికి హుస్సేన్ సాగర్లో దూకిన దొంగ
Districts
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్ లో ఓ దొంగ పోలీసులనుండి తప్పించుకోబోయి హుసేన్ సాగర్ లో దూకాడు. శుక్రవారం ఉదయం దారిన వెళుతున్న ఓ వ్యక్తి నుండి ఓ దొంగ సెల్ ఫోన్ దొంగిలించాడు. దీనిని అక్కడే ఉన్న పోలీసులు గమనించారు. వెంటనే ఆ దొంగను పట్టుకోవడానికి వెంటపడ్డారు. అది గమనించిన దొంగ పరుగందుకున్నాడు. పోలీసులు అతన్ని వెంబడించటంతో ఏం చేయాలో తోచక పక్కనే ఉన్న సాగర్లోకి దూకాడు. దొంగ నీళ్లలోనుండి బయటకు వచ్చేదాకా నిరీక్షించి తర్వాత జైలుకు తరలించారు పోలీసులు.