ఎమ్మార్ పై అక్రమాలపై సీబీఐ విచారణ: వి హనుమంతరావు

కాంగ్రెసు లోని ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఎమ్మార్ కుంభకోణాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలని, లేకుంటే అక్రమాలలో వారికీ భాగస్వామ్యం ఉందని ప్రజలు అనుకునే అవకాశాలున్నాయని కాబట్టి కాంగ్రెసు వారంతా సిబిఐ విచారశకు అనుకూలంగా ఉండాలని సూచించారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి పార్టీ సమావేశంలో అన్ని అక్రమాలపై స్పందించి కేవలం ఎమ్మార్ పైనే స్పందించక పోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు.
ఎమ్మార్ కుంభకోణంలో అక్రమాలు భారీగా ఉన్నందున, ఎపీఐఐసీ లోని వారు మాజీ అధికారులు అక్రమాలకు పాల్పడే అవకాశమున్నందున సీబీఐ విచారణ జరిపించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఏపీఐఐసి చేతుల్లో పెట్టి చేతులు దులుపుకోవటం సమంజసం కాదన్నారు. ఈ కుంభకోణంలో టీడీపీ ఉందా, కాంగ్రెసు ఉందా బయటికి రావాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications