వైయస్ జగన్ క్యాంప్ ను వ్యతిరేకించిన మర్రి శశిధర్ రెడ్డి

ఇతర పదవులు నిర్వహించడానికి ప్రస్తుత పదవి అడ్డం కాదని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. తెలంగాణపై తన నిబద్ధతను ప్రశ్నించాల్సిన అవసరం లేదని, తెలంగాణ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. కార్యకర్తలను తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పదవుల్లో ఉన్నవారికి ఉంటుందని, కార్యకర్తలను విస్మరిస్తే పార్టీకి నష్టం కలుగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications