మెదక్: మెదక్ జిల్లా కొండపాక మండలంలోని తిమ్మరెడ్డిపల్లిలో ఓ వ్యక్తి జేబులోని సెల్ ఫోన్ పేలింది. గ్రామానికి చెందని రాములు అనే అతడు తన సెల్ ఫోన్ ను శనివారం సాయంకాలం సమయంలో తన ప్యాంటు జేబులో వేసుకున్నాడు. ఆ సమయంలో అతను ఇంట్లోనే ఉన్నాడు. అయితే జేబులోనున్న సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఫోన్ తో పాటుగా ఉన్న డబ్బులు కాలిపోయాయి. రాములుకు స్వల్పంగా గాయపడ్డాడు.